మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరో నిఖిల్ తో కలిసి 18 పేజెస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్2 బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి
ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానుంది.ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఈ సినిమాకి కార్తికేయ 2 కన్నా ముందుగానే సైన్ చేశాను కార్తికేయ టు అడ్వెంచర్స్ మూవీ అయితే 18 పేజెస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఇందులో తాను నందిని అనే అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపిస్తానని ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ లేకుండా ఒక్క క్షణం గడప లేనటువంటి రోజులు.
అయితే ఎలాంటి సెల్ ఫోన్స్, ఏవి లేకుండా చాలా అమాయకపు నందిని పాత్ర నా మనసును చాల నచ్చిందని ఈమె తెలిపారు. ఇక అల్లుఅరవింద్ గారు తనలాంటి కూతురు ఉంటే బాగుండని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందుకే మా కజిన్స్ అందరూ కూడా అల్లు అరవింద్ గారిని మామయ్య అంటూ పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు.. ఇకపోతే ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ కూడా బాగమయ్యారు.
ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఛాన్స్ మిస్ అయినప్పుడు తను చాలా బాధపడ్డానని చెప్పుకోచ్చారు. ఇక మనం ఏ సినిమా కథలను ఎంపిక చేసుకోలేమని కథనే మనల్ని ఎంపిక చేసుకుంటుందని ఈమె తెలిపారు.అప్పుడు రంగస్థలం మిస్ అయిన ఇప్పుడు సుకుమార్ గారు రాసిన నందిని పాత్రలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!