Anupama: టిల్లు స్క్వేర్ గురించి కాదు….18 పేజస్ గురించి మాట్లాడుకుందాం: అనుపమ

అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం 18 పేజెస్.ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిఖిల్ అనుపమ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ కు డీజే టిల్లు సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం డీజే ట్టిల్లు ఈ సినిమా ఎలాంటి విజయం అందుకున్నదో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కూడా ప్రారంభమైంది. అయితే ముందుగా ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తుందని వార్తలు వచ్చాయి. కొన్ని కారణాలవల్ల శ్రీ లీల తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి అనుపమ వచ్చిందని తెలిపారు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం సిద్దు జొన్నలగడ్డతో ఉన్న విభేదాలే కారణమని అందుకే ఈమె ఈ సినిమా నుంచి తప్పకున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా 18 పేజెస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డీజే టిల్లు 2 గురించి అనుపమకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. డీజే టిల్లు సీక్వెల్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం హీరోతో ఉన్న వివాదాలే అనే ప్రశ్న ఎదురు కావడంతో ఈ సినిమా గురించి అనుపమ ఫ్రస్టేషన్ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే అనుపమ మాట్లాడుతూ….

ప్రస్తుతం 18 పేజెస్ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం..టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ మాత్రమే చదివాను అంటూ ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ డిజె టిల్లు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus