వ్యాపారవేత్తతో మాజీ మిస్ వరల్డ్ డేటింగ్..?

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. ఆ తరువాత అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రాణి గెటప్ లో కనిపించింది మానుషి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇండియాలోనే అతిపెద్ద స్టాక్ బ్రోకరేజీ సంస్థ జీరోదా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో ప్రేమలో పడిందట మానుషి.

గతేడాది నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అయితే ఈ విషయంపై మానుషి గానీ నిఖిల్ కానీ స్పందించలేదు. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్తూ మీడియా కంట పడుతున్నారు. ఇప్పుడు ఈ జంట రిషికేష్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిఖిల్, మానుషి ప్రేమలో ఉన్న మాట నిజమేనని సన్నిహితవర్గాల సమాచారం.

ప్రస్తుతం మానుషి బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిందని.. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఆమెకి నచ్చదని.. అందుకే ప్రేమ విషయం బయటకు చెప్పడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మానుషి ప్రేమిస్తోన్న నిఖిల్ కామత్ కి గతంలోనే పెళ్లి జరిగింది. అమందా పూర్వంకర అనే మహిళను 2019లో పెళ్లి చేసుకున్నారు నిఖిల్. కానీ పెళ్లైన ఏడాదికే ఈ జంట విడిపోయింది. దానికి కారణాలు మాత్రం బయటకు రానివ్వలేదు.

భార్యతో విడిపోయిన కొంతకాలానికే అతడికి మానుషితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అది ప్రేమగా మారింది. వీరి ప్రేమ సంగతి ఇరు కుటుంబసభ్యులకు కూడా తెలుసట. మరి ఈ జంట పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి!

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus