Naga Chaitanya, Sobhita Dhulipala: చైశోభిత వైవాహిక బంధం అలా ఉంటుంది.. ఆ జ్యోతిష్కుడు ఏమన్నారంటే?
- August 21, 2024 / 11:30 AM ISTByFilmy Focus
చైతన్య (Naga Chaitanya) శోభిత (Sobhita Dhulipala) నిశ్చితార్థం జరిగి దాదాపుగా రెండు వారాలు అవుతుండగా చైతన్య శోభిత జాతకాలు చూసి వేణుస్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అయ్యాయి. వేణుస్వామి నెగిటివ్ గా చెప్పడం విషయంలో అక్కినేని అభిమానులు సైతం ఆయనను ట్రోల్ చేయడం జరింది. వేణుస్వామిపై కొంతమంది ఫిర్యాదులు సైతం చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఉత్తరాది ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చైతన్య శోభిత జాతకాలను పరిశీలించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.
Naga Chaitanya, Sobhita Dhulipala

2025 ఫస్ట్ హాఫ్ లో చైతన్య శోభిత పెళ్లి జరిగితే వీళ్లిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు. చైశోభిత వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు, కలతలు ఉండవని సంతోషం, ఎమోషన్స్, ఆప్యాయత వీళ్లిద్దరి జీవితాల్లో అపరిమితంగా ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు. న్యూమరాలజీ ప్రకారం 8 అంటే అపరిమితం అని పండిట్ జగన్నాథ్ గురూజీ వెల్లడించారు.

ఈ జ్యోతిష్కుడు చెప్పిన జాతకం నిజం కావాలని చైతన్య శోభిత అభిమానులు కోరుకుంటున్నారు. జ్యోతిష్కులు జాతకంలో సమస్యలు ఉన్నా వాటికి పరిహారాలు చెప్పాలే తప్ప భయాందోళనకు గురి చేసే విధంగా జాతకాలు చెప్పడం సరి కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చైతన్య, శోభిత పెళ్లి ఈ ఏడాదే జరుగుతుందో లేక వచ్చే ఏడాది జరుగుతుందో తెలియాల్సి ఉంది.

ఈ జాతకం గురించి అక్కినేని కుటుంబానికి తెలిస్తే మాత్రం జ్యోతిష్కుడు చెప్పిన జాతకానికి అనుగుణంగా పెళ్లి చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు నాగచైతన్య తండేల్ (Thandel) మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ పెద్ద సినిమాలకు అనుకూలం కాదు. డిసెంబర్ లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నుంచి తప్పుకుంటున్న తండేల్ డేట్ గురించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.















