జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్ 2′(అవతార్ : ది వే ఆఫ్ వాటర్) నిన్న అంటే డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఏకంగా 160 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. 13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించింది.
వీకెండ్ కు భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ‘అవతార్’ తెలుగు వెర్షన్ కు టాలీవుడ్ దర్శకుడు.. శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారట. ఈ ఏడాది వచ్చిన మరో డబ్బింగ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ కి కూడా ఇతను సంభాషణలు అందించాడు. అవసరాల శ్రీనివాస్ అమెరికాలో చదువుకున్నాడు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడు. హాలీవుడ్ మేకర్స్ తో ఇతనికి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే ‘అవతార్2’ కి ఇతన్ని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు మేకర్స్.
గతంలో హాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్ డైలాగులు చాలా కామెడీగా అనిపించేవి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కోసం నోటెడ్ రైటర్స్ ను హాలీవుడ్ మేకర్స్ సంప్రదించేవారు కాదు. అయితే ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న అవసరాల వంటి దర్శకుడిని ‘అవతార్2’ కి డైలాగ్ రైటర్ గా ఎంపిక చేసుకోవడం హాలీవుడ్ మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయం అనొచ్చు . ఇదిలా ఉండగా..
‘అవతార్2’ కి డైలాగ్ రైటర్ గా చేసినందుకుగాను అవసరాల శ్రీనివాస్ కు రూ.75 లక్షల వరకు పారితోషికం ఇచ్చారట. కేవలం డైలాగ్ రైటర్ గా చేసినందుకే ఇంత అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక అవసరాల శ్రీనివాస్.. ‘ఊహలు గుసగుసలాడే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఇతని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.