వెండితెరపై రికార్డుల సునామీ సృష్టించిన బాహుబలి.. బుల్లితెరపైన కూడా సంచలనం కలిగిస్తోంది. థియేటర్లలో 2015 జులై 10 అడుగుపెట్టిన బాహుబలి వంద రోజులు కలెక్షన్లు కురిపించి టీవీలోకి ప్రవేశించాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ కళాఖండం 2015 అక్టోబర్ 24 న ప్రసారమై టెలివిజన్ రేటింగ్ పాయింట్ ని పరుగులు పెట్టించింది. తొలి సారి టెలికాస్ట్ అయిన రోజు మాటీవీ టీఆర్పీ 35 – 40 వరకు చేరి అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచి వేసింది.
ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరోచిత విన్యాసాలు, అమోఘమైన పాటలు, అద్భుతమనిపించే గ్రాఫిక్స్ ఇలా అనేక అంశాలు తెలుగు ప్రేక్షకులను టీవీ ముందు కూర్చోబెడుతున్నాయి. కొన్నిసారు ప్రసారం కాగానే ఏ సినిమాకు అయినా టీఆర్పీ క్రమంగా తగ్గిపోతుంది. ఆ రూల్ ని మార్చేసింది బాహుబలి. ఇప్పటి వరకు బాహుబలి టీవీలో 10 సార్లు ప్రసారమైన రేటింగ్ లో పెద్ద మార్పు ఏమి లేదని టెలివిజన్ వర్గాల వారు వెల్లడిస్తున్నారు. ఆ సినిమాపై ఇంకా మోజు తగ్గలేదని వారు వివరించారు. బాహుబలి కంక్లూజన్ వచ్చేవరకు ఆ క్రేజ్ అలాగే ఉంటుందని భావిస్తున్నారు.