“నేనెవర్ని ” .. అని ప్రభాస్ చెప్పే డైలాగ్ జనాలని థియేటర్ కి రప్పించాయి. అతనెవరో తెలుసుకోవడానికి బాహుబలి చిత్రాన్ని తెలుగు ప్రజలు చూసారు. తెలుసుకున్నారు. ఇప్పుడు దేశం మొత్తం బాహుబలి ఎవరో తెలుసుకోవాలని రాజమౌళి బృందం భావిస్తోంది. 2015 జులై 10 న తొలిసారి రిలీజ్ అయిన ఈ మూవీ ఆరు వందల కోట్లు కొల్లగొట్టింది. టీవీల్లోనూ అనేక సార్లు ప్రసారమైంది. సినిమా ప్రేమికులందరూ చూసారు. అయితే థియేటర్లో చూడకుండా మిస్ అయిన వారికోసం ఈ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేయాలనీ జక్కన్న డిసైడ్ అయ్యారు. హిందీ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ఆలోచనకు దర్శకధీరుడు ఓకే చెప్పడంతో థియేటర్లో సందడి చేయడానికి బాహుబలి మొదటి పార్ట్ ముస్తాబవుతోంది.
బాహుబలి సెకండ్ పార్ట్ ఈనెలలో 28 రిలీజ్ కానుంది కావున, మూడు వారాల ముందుగా అంటే 7 వ తేదీన బాహుబలి (హిందీ వెర్షన్)ను విడుదల చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రెండో పార్ట్ పై క్రేజ్ పెరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక వారం ముందుగా.. ఏప్రిల్ 21 న కొన్ని థియేటర్లో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయాలనీ నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ విషయంపై త్వరలో అధికార ప్రకటన రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.