బాహుబలి బ్రాండ్ ఇమేజ్ తో ఆర్ఆర్ఆర్ బిజినెస్ ఓ రేంజ్లో…!

దేశం మెచ్చే దర్శకులలో ఒకరిగా ఉన్న రాజమౌళి తాను తీసే చిత్రానికి సంబంధించి అన్నీ తానై నడిపిస్తాడు. 24క్రాఫ్ట్స్ పై మంచి పట్టున్న రాజమౌళి ప్రతి విషయంలో తనకు నచ్చే ఔట్ ఫుట్ ఇతరుల దగ్గర నుండి రాబడతాడు. అలాగే సినీమా మార్కెట్ విషయంలో కూడా పూర్తి బాధ్యత రాజమౌళి తీసుకుంటారు. బాహుబలి సినిమా ప్రమోషన్స్ నుండి భారీ బిజినెస్ జరిగే వరకు రాజమౌళి కీలక పాత్ర పోషించారు. కార్పొరేట్ బిజినెస్ మెన్ సైతం రాజమౌళి బాహుబలి విషయంలో పాటించిన మార్కెటింగ్ స్ట్రాటజీ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ గా ఉన్న ఐ ఐ ఎమ్స్ వంటి విద్యా సంస్థలలో కూడా బాహుబలి కలెక్షన్స్, బిసినెస్ సూత్రాలు పాఠాలుగా ఉన్నాయి.

ఇక ఆయన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ గురించి కూడా రాజమౌళి భారీ ప్రణాళికలు వేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ థియరిటికల్ హక్కులు అమ్మేసినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. బాహుబలి రెండు చిత్రాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి బ్రాండ్ వాల్యూ వంద రెట్లు పెరిగింది. కాబట్టి ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకోవాలని రాజమౌళి ప్లాన్ అట. నిర్మాత దానయ్య అయినప్పటికీ, రాజమౌళినే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ చూసుకుంటున్నారట. ఇక రాజమౌళి రెమ్యూనరేషన్ కూడా లాభాలలో వాటా కాబట్టి, ఈ లెక్క ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కాబట్టి, ఆర్ ఆర్ ఆర్ కి భారీ బిజినెస్ జరిగేలా ప్లాన్స్ సిద్ధం చేశారట. ఇక ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది జులై 30న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus