అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్ (Amritha Aiyer) నటించిన మూవీ ‘బచ్చల మల్లి'(Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగినట్లు నిర్మాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
Bachhala Malli:
ఇక థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
‘ బచ్చల మల్లి’ సినిమాకి రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే క్రిస్మస్ సీజన్ కాబట్టి..మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి..!