పవన్ దర్శకుడినే కాదంటున్నారు….
- March 18, 2017 / 07:43 AM ISTByFilmy Focus
ఆయన ఒక సూపర్ డైరెక్టర్…పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బ్లాక్ బష్టర్ అంటే ఎంతో తొలిసారి రుచి చూపించిన దర్శకుడు…టాలీవుడ్ లో అప్పట్లోనే రికార్డులను తిరగరాసిన హిట్ అందించిన దర్శకుడు….అయితే అలాంటి దర్శకుడికి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి…సూపర్ హిట్ దర్శకుడు….టాప్ దర్శకుడు…టాలెంట్ ఉన్న దర్శకుడు అన్న వాళ్ళే ఇప్పుడు అతన్ని కాదంటున్నారు….ఇంతకీ ఎవరా దర్శకుడు…ఏమా కధ అంటే….టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరు తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కు మొదట్లో అదృష్టం కలసి రాలేదు….అయితే అన్నయ్యను అనుసరిస్తూ….తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశాడు…కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించక పోవడంతో….తనదైన మ్యానరిజంతో జనాలను ఆకర్శించడం మొదలు పెట్టాడు. తనకు తెలిసిన విధ్యలు…కరాటే విన్యాసాలు…సిరియస్ యాక్షన్, కామెడీ తో అభిమానులకు దగ్గరయ్యాడు.
అదే సమయంలో ‘తొలిప్రేమ’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకులు కరుణాకరన్. ఆ దెబ్బతో మనోడి పేరు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. ఆ సినిమా తర్వాత కరుణాకరన్ చెప్పుకోతగ్గ సినిమాలేవీ చేయకపోయినా తొలిప్రేమ పేరుతో ఇన్నాళ్లు లాగించేసాడు. ఇక ఆ తరువాత చాలా సినిమాలు చేసినప్పటికీ కరునాకరన్ కు పెద్దగా హిట్స్ రాలేదు….దీంతో మరోసారి పవన్ ను కలసి సినిమా చేసేందుకు విశ్వ ప్రయత్నాలే చేశాడు…కానీ….తాను చెప్పిన కధ పవన్ కు నచ్చకపోవడంతో….పవన్ సైతం హాండ్ ఇవ్వగా… అదే క్రమంలో….యంగ్ హీరోలు సైతం చూద్దాం.. చేద్దాం అని అంటూ…డేట్స్ మాత్రం ఇవ్వలేదు….దీనితో ఆ దర్శకుడి స్థితి, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది…హిట్స్ ఇచ్చినప్పుడు నెత్తిన పెట్టుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవడంలేదు…అని బాధపడుతున్నాడు….ఆ దర్శకుడు….పాపం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















