నవ్వుకు చాలా అర్థాలుంటాయి. అందుకే నవ్వుతో ఏ విషయాన్ని పూర్తిగా కన్వే చేయలేం అంటారు. అందులో సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకునేటప్పుడు నవ్వు ఇంకా డేంజర్. అయితే ఇలాంటి నవ్వే ఒకటి నవ్వారు నందమూరి బాలకృష్ణ. ఇందులో ఏముంది అనుకోవద్దు. ఇక్కడ టాపిక్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ. ఇప్పుడు నవ్వు సమాధానం ఎలాంటి ఫీల్ ఇస్తుందో అర్థమైందా? ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చాలా విషయాల గురించి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల ప్రస్తావన వచ్చింది. ఆ ప్రశ్నకు బాలయ్య సమాధానమిస్తూ ‘‘ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. మరి ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తాడా? లేదా? అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు’’ అని చెప్పారు బాలయ్య. ఆ ప్రశ్న అక్కడితో ఆగిపోయుంటే… ఈ నవ్వు ప్రస్తావన వచ్చేది కాదు. ఆ యాంకర్ ఇంకొంచె డీప్‌గా ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా?’ అని యాంకర్ అడిగారు.
ముందు ప్రశ్నకు ఓపెన్‌గా సమాధానం చెప్పిన బాలయ్య… ఈ ప్రశ్నకు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నారు. దీంతో బాలయ్య మనసులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే కాసేపటికే ‘ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్లస్ అయి… ఆ తర్వాత మైనస్ అయితే’అని వ్యాఖ్యానించారు. దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఇప్పుడు బాగున్నా, తర్వాత సమస్య వస్తుంది అనేది బాలయ్య ఉద్దేశం ఏమో.