స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఎవరైనా కష్టాల్లో ఉన్నరని తెలిస్తే వేగంగా స్పందించి తన వంతు సహాయం చేస్తారు. ఉదయభాను, ప్రదీప్, మరి కొందరు సెలబ్రిటీలు పలు సందర్భాల్లో బాలకృష్ణ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. తాజాగా బాలకృష్ణ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ ఆస్పత్రిలో మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే చిన్నారి క్యాన్సర్ తో బాధ పడుతూ చేరారు.
ఆపరేషన్ కోసం మొత్తం 7 లక్షల రూపాయలు ఖర్చు కానుండగా మణిశ్రీ పేరెంట్స్ దాతల నుంచి కొంత డబ్బును విరాళాల రూపంలో సేకరించారు. అయితే మణిశ్రీ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో 5 లక్షల 20 వేల రూపాయలు చెల్లించడం కష్టమైంది. చిన్నారి తల్లిదండ్రులు బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిని కలిసి ఆర్థిక పరిస్థితిని వివరించి తమకు సహాయం చేయాలని కోరారు. బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా బాలయ్య 5 లక్షల 20వేల రూపాయలు మాఫీ చేయించి చిన్నారికి ఆపరేషన్ జరిగేలా చూశారు.
బాలయ్య మరోసారి ఉదారతను చాటుకోవడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తుండగా వచ్చే నెల నుంచి బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొదలు కానుంది. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని బాలకృష్ణతో ఆ సినిమాను మించిన హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.