మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం టీడీపీ పగ్గాలు చేపట్టేదెవరనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. టీడీపీ తదుపరి కార్యాచరణ గురించి ప్రధానంగా ఈ చర్చ జరిగినట్టు సమాచారం అందుతోంది. పార్టీని ఎవరు ముందుండి నడిపించాలి? పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెట్టాలనే చర్చ ప్రధానంగా జరిగింది.
గతంలో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చంద్రబాబు చూసుకునేవారు. లోకేశ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నా అనుభవం లేకపోవడంతో ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలను బాలయ్య తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య తర్వాత లోకేశ్, బ్రాహ్మణి పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి అర్హులు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పార్టీకి ప్రస్తుతానికి బాలయ్యే నాయకుడు కావాలని టీడీపీలోని ఒక వర్గం ఆశిస్తోంది.
ప్రస్తుతం బాలయ్య (Balakrishna) పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను బాలయ్య పూర్తి చేయాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుంది. అందువల్ల బాలయ్య పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కావడం కూడా సులువు కాదు. బాలయ్య ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలయ్య పార్టీ బాధ్యతలను తీసుకుంటానని చెబితే అడ్డు చెప్పేవాళ్లు సైతం ఉండరు. చంద్రబాబు బెయిల్ విషయంలో కూడా ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకు వచ్చి టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా అక్టోబర్ నెల 19వ తేదీన విడుదల కానుంది. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య సినిమాల ద్వారా ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది.