Balakrishna, Mahesh Babu: బాలయ్య మహేష్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు ఎవరూ ఊహించని సెలబ్రిటీలు గెస్టులుగా హాజరవుతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ కు మోహన్ బాబు రాగా రెండో ఎపిసోడ్ కు నాని, మూడో ఎపిసోడ్ కు బ్రహ్మనందం, అనిల్ రావిపూడి నాలుగో ఎపిసోడ్ కు అఖండ టీమ్ హాజరయ్యారు. అయితే మహేష్ బాబు ఈ షోలో పాల్గొన్న ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తాజాగా సందడి చేసిన మహేష్ బాబు కొన్ని రోజుల గ్యాప్ లోనే అన్ స్టాపబుల్ షోలో కనిపిస్తూ ఉండటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నెల 17వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ మేరకు ఆహా నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అదే రోజు బన్నీ నటించిన పుష్ప పార్ట్1 థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఒకేరోజు అటు బన్నీ ఇటు మహేష్ సందడి చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య మహేష్ తో ఈ షోలో ఎలాంటి సీక్రెట్స్ ను చెప్పించారో చూడాల్సి ఉంది. రాబోయే వారాల్లో అన్ స్టాపబుల్ షోకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ ఈ షో ద్వారా ఆహా ఓటీటీని మరో లెవెల్ కు తీసుకెళ్లారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.