టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య రెమ్యునరేషన్ గత కొన్నేళ్లలో భారీ రేంజ్ లో పెరిగింది. బాలయ్య సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడంతో రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది. బాబీ సినిమాకు బాలయ్య ఏకంగా 28 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బాలయ్య పారితోషికం అంతకంతకూ పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. వీరసింహారెడ్డి సినిమాకు మొదట 14 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న బాలయ్య ఏడాది తిరగకుండానే ఆ మొత్తానికి రెట్టింపు రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.
వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత బాలయ్య పారితోషికం 18 కోట్ల రూపాయలకు పెంచారని వార్తలు వచ్చాయి. అఖండ సినిమాకు మాత్రం బాలయ్య కేవలం 10 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకున్నారు. బాలయ్య సినిమాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు 130 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవుతూ ఉండటం ప్రతి సినిమా లాభాలను అందిస్తుండటంతో బాలయ్య సినిమాల హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
బాలయ్య (Balakrishna) పారితోషికం రాబోయే రోజుల్లో 50 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బాలయ్య పారితోషికం పెంచినా చాలామంది హీరోలతో పోల్చి చూస్తే రీజనబుల్ గా తీసుకుంటున్నారు.
బాలయ్య బాబీ కాంబో మూవీ సితార బ్యానర్ పై తెరకెక్కుతోంది. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలయ్య వరుస సినిమాలతో మార్కెట్ ను పెంచుకుంటుండగా తర్వాత సినిమాలతో అయినా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారేమో చూడాలి.