సాధారణంగా ఏదైనా ఫంక్షన్‌కి ఇంట్లో పెద్దవాళ్లు వెళ్లడం కుదరకపోతే పిల్లలను పంపిస్తుంటారు.. అలాగే నటరత్న ఎన్టీఆర్ తను తీసుకోవాల్సిన ఓ అవార్డును అందుకోవలసిందిగా తన తరపున నట వారసుడు బాలకృష్ణను పంపారనే అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది.. అప్పుడంటే మీడియా, సోషల్ మీడియా ఇంత వేగంగా లేదు కాబట్టి ఇలాంటి రేర్ మూమెంట్స్ గురించి తెలిసే అవకాశాలు చాలా తక్కువ.. వివరాల్లోకి వెళ్తే.. తన తర్వాత తన నట వారసుడిగా బాలయ్య మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు ఎన్టీఆర్..
అందుకే బాల నటుడిగానే బాలయ్యను ఇంట్రడ్యూస్ చేశారు.. దగ్గరుండి మేకప్ వేసి మరీ కొడుకు చేత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయించేవారు.. అలా ప్రతి విషయంలోనూ తండ్రి అడుగు జాడల్లో నడవడం.. తండ్రి అలవాట్లను పుణికి పుచ్చుకోవడం బాలయ్యకు అలవాటైపోయింది.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానులను సంపాదించుకున్నాడు.. రామారావు బిజీగా ఉన్న సమయంలో ఓ అవార్డ్ అందుకోవలసి వచ్చింది.. అది తన స్థాయికి చిన్నదే అయినా బిజీగా ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి హాజరై..
మా తరపున మీరు అవార్డ్ తీసుకోండి అని బాలయ్యకు చెప్పి పంపారట.. తండ్రి మాటను తూచ తప్పకుండా పాటించే బాలయ్య ఆ ప్రోగ్రాంకి వెళ్లాడు.. జ్యోతి చిత్ర మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం ‘‘సూపర్ స్టార్’’ అనే ఓటింగ్ పోల్ నిర్వహించేది.. అప్పట్లో ఈ అవార్డులకు మంచి ఆదరణ ఉండేది..అందులో మొదటి పోల్‌లో (1981) ఎన్టీఆర్ గారు సెలెక్ట్ అయ్యారు.. ఆయన పనుల వల్ల రాలేకపోవడంతో బాలయ్య అవార్డ్ అందుకున్నారు..
ఇదే వేదిక మీద దర్శకరత్న దాసరి నారాయణ రావు, సహజనటి జయసుధ కూడా అవార్డులందుకున్నారు.. అప్పుడు బాలయ్య వయసు 21 సంవత్సరాలు.. బ్లేజర్ వేసుకుని ఉన్న యువరత్న రేర్ పిక్ అభిమానులను అలరిస్తుంది.. కేవలం నటనలోనే కాకుండా బసవతారకం హాస్పిటల్, సేవా కార్యక్రమాలు, రాజకీయాలలోనూ రాణిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు బాలయ్య బాబు..