ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించడంతో ఆ ప్రభావం భారీ సినిమాల కలెక్షన్లపై పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ ను కలుస్తామని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రకటన చేయగా బాలకృష్ణ సైతం సీఎం జగన్ ను కలవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తమ సినిమాల విడుదల నేపథ్యంలో స్టార్ హీరోలు ఏపీ టికెట్ రేట్లపై దృష్టి పెట్టారని సమాచారం. జగన్ ను కలవడం సాధ్యం కాకపోతే బాలకృష్ణ పేర్ని నానిని కలిసే ఛాన్స్ అయితే ఉంది.
టికెట్ రేట్లు పెరగకపోతే నిర్మాత నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సీఎం జగన్ బాలకృష్ణకు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. మరి బాలకృష్ణకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ దొరుకుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు దిల్ రాజు కూడా పవన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని బోగట్టా. సంక్రాంతికి రిలీజవుతున్న మూడు సినిమాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడంతో మూడు సినిమాలు రిలీజైతే ఇబ్బందులు తప్పవు.
భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో పవన్ అభిమానులు సైతం పట్టుదలతో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల టాలీవుడ్ లో అపాయింట్‌మెంట్ల పర్వనం నడుస్తుండటం గమనార్హం. పవన్ అపాయింట్‌మెంట్ దొరికితే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి వరుసగా ప్రతి నెలలో పెద్ద సినిమాలు రిలీజవుతూ ఉండటం గమనార్హం.