Balayya: రెండు టైటిల్స్ తో కన్ఫ్యూస్ అవుతున్న బాలయ్య టీం..!
- November 14, 2024 / 08:30 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ (Bobby) దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ (Jersey) బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Rama Srinath) హీరోయిన్ గా నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), చాందినీ చౌదరి (Chandini Chowdary) వంటి హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒకటి, రెండు గ్లింప్స్..లను విడుదల చేశారు.
Balayya

కానీ ఇప్పటివరకు టైటిల్ ఏంటనేది ప్రకటించలేదు.బాలయ్య కెరీర్లో 109వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సంక్రాంతికి వచ్చే మిగిలిన సినిమాలు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంటే.. ఈ సినిమా టైటిల్ కూడా రివీల్ చేయలేదు అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. దీంతో హుటాహుటిన నవంబర్ 15నే టైటిల్ తో పాటు చిన్న టీజర్ ను కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక మరోపక్క ఈ చిత్రానికి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు అంతా చెప్పుకుంటున్నారు. కానీ ‘సర్కార్ సీతారాం’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ‘సర్కార్ సీతారాం’ బాగానే ఉంది కానీ.. ఇది విజయ్ ‘సర్కార్’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాలను గుర్తుచేస్తుందేమో అని టీం అయోమయంలో ఉన్నారు.

ఇక ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ రెండు, మూడు రోజుల నుండి ప్రచారంలో ఉంది. ఇది బాలయ్య (Balayya) అభిమానులను అట్రాక్ట్ చేయడం లేదు. ‘ఇదేం టైటిల్ రా బాబు’ అంటున్నారు. ఒకవేళ దానినే ఫిక్స్ చేస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
‘దేవర’ అర్థశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లో అంటే?
















