బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి (Chatrapathi) ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా పరిచయం చేసిన వి.వి.వినాయక్ .. ఛత్రపతి రీమేక్ తో అతన్ని హిందీలో కూడా లాంచ్ చేస్తున్నాడు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2020 లోనే ప్రారంభమైంది.కానీ ఇంకా రిలీజ్ కాలేదు.షూటింగ్ కూడా గతేడాది కంప్లీట్ అయ్యింది. కానీ ఈ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ..
ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈరోజు ఈ చిత్రం టైటిల్ ను, రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి కూడా ఛత్రపతి టైటిల్ నే ఫైనల్ చేశారు. హిందీలో ఈ టైటిల్ ను ఆల్రెడీ వేరే సినిమాకి రిజిస్టర్ చేయించుకున్నారు. అయినా సరే పెన్ స్టూడియోస్ సంస్థ కాబట్టి..ఆ టైటిల్ ను దక్కించుకోగలిగింది . అయితే తెలుగులో కూడా ఆ టైటిల్ తోనే రిలీజ్ చేస్తారా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
ముందుగా ఈ చిత్రం కోసం 12 టైటిల్స్ అనుకున్నారు. కానీ ఏది కూడా టీమ్ అందరికీ నచ్చలేదు. దీంతో ఛత్రపతి టైటిల్ నే ఫైనల్ చేశారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేయడానికి ఒకే టైటిల్ ఉండాలి. కానీ తెలుగులో మాత్రం వేరే టైటిల్ పెడితేనే బెటర్. లేదంటే అదే కథ, అదే టైటిల్ తో సినిమాని చూడటానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించలేకపోవచ్చు.