క్రాక్ టు అఖండ… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచిన సినిమాల లిస్ట్..!

ఒక సినిమా హిట్ అవ్వడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి అనేది ఒకప్పటి మాట. కానీ 2021 లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందని ప్రూవ్ అయ్యింది. నిజానికి ఇది ప్రూవ్ అయ్యేలా చేసింది మన తమన్. ఈ ఏడాది మొత్తం తమన్ నామ సంవత్సరమే అనాలి..! ఓ పక్కన యూట్యూబ్లో తన పాటలతో శ్రోతల్ని మెప్పిస్తూనే మరోపక్క సినిమాల్లో నేపధ్య సంగీతంతో ప్రేక్షకులకి గూజ్ బంప్స్ తెప్పించాడు తమన్ అనడంలో సందేహం లేదు.పెద్ద సినిమా అంటే తమన్ బి.జి.ఎం చాలా ముఖ్యం అనే స్టేజికి వెళ్ళాడు.

‘పుష్ప’ సినిమా కనుక చూసుకుంటే మాస్ ఎలివేషన్ సీన్లకి దేవి అందించిన నేపధ్య సంగీతం సరిపోలేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘ఈ సీన్ కి తమన్ బి.జి.ఎం అందించి ఉంటే’… అనే మాట చాలా నోళ్ళల్లో నానింది. తమన్ మాత్రమే కాదు 2021 లో అనిరుథ్ కూడా తన మార్క్ బి.జి.ఎం లతో మాస్ కు గూజ్ బంప్స్ తెప్పించడమే కాదు.. వాటిని రింక్ టోన్లుగా కూడా పెట్టుకునేలా చేసాడు. ఇంకా ఈ లిస్ట్ లో ఏ సినిమాలు ఉన్నాయో.. వాటిలో ఏ బి.జి.యం హైలెట్ అయ్యిందో.. వాటికి సంగీత దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) క్రాక్ :

ఈ సినిమాకి తమన్ అందించిన బ్యాక్ స్కోర్ కు ఎంత చెప్పుకున్నా.. తక్కువే..! పోలీస్ సైరన్ బి.జి.ఎం, కఠారి కృష్ణ థీమ్ మ్యూజిక్.. అవుట్ స్టాండింగ్ అనిపిస్తాయి.

2) మాస్టర్ :

తమిళ్ సినిమానే అయినప్పటికీ.. ఈ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం అనిరుథ్ అందించిన మ్యూజిక్. మరీ ముఖ్యంగా అతను అందించిన బి.జి.యం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.ఈ చిత్రంలో చాలా ట్యూన్ లని ప్రేక్షకులు తమ కాలర్ ట్యూన్లుగా పెట్టుకున్నారు అంటేనే ఈ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

3) ఉప్పెన :

ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్టే.. తెలిసిందే కదా..! బి.జి. అయితే విలన్ విజయ్ సేతుపతి ఫ్రేమ్లోకి వచ్చిన ప్రతీసారి ఓ బి.జి.ఎం వస్తుంది. దాంతో దేవి శ్రీ భయపెట్టేసాడని చెప్పాలి.

4) జాతి రత్నాలు :

ఈ చిత్రంలో కూడా రథన్ అందించిన బి.జి.ఎం సూపర్ గా ఉంటుంది.

5) వకీల్ సాబ్ :

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడానికి తమన్ అందించిన బి.జి.ఎం కూడా ఓ కారణమని చెప్పాలి.

6) సీటీమార్ :

గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి మణిశర్మ అందించిన బి.జి.ఎం సూపర్ అని చెప్పాలి.

7) లవ్ స్టోరీ :

ఈ ఫీల్ గుడ్ మూవీకి పవన్ సి.హెచ్ అందించిన బి.జి.ఎం థియేటర్ల నుండీ బయటకి వచ్చాక కూడా మనల్ని వెంటాడుతుంది.

8) డాక్టర్ :

ఈ చిత్రానికి అనిరుథ్ అందించిన బి.జి.ఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

9) కురుప్ :

ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ అందించిన బి.జి.ఎం హైలెట్ అని చెప్పాలి.

10) అఖండ :

ఈ చిత్రానికి తమన్ అందించిన బి.జి.ఎం కి పూనకాలు వచ్చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

Share.