Pawan Kalyan: ‘భవదీయుడు..’ మొదలు అప్పుడేనా.. ఎలా అంటే

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఎప్పుడు? సినిమా రిలీజ్‌ డేట్‌ కోసం అడుగుతున్నాం అనుకునేరు.. మేం అడుగుతున్నది సినిమా ఓపెనింగ్‌ డేట్‌ గురించి. చాలామంది దర్శకులు, హీరోలు తమ సినిమా రిలీజ్‌ డేట్‌ కోసం చూస్తుంటే, హరీశ్‌ శంకర్‌ మాత్రం సినిమా ప్రారంభించే తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడుతూనే ఉంది. తాజాగా కొత్త డేట్ ఒకటి బయట్‌ సర్క్యులేట్‌ అవుతోంది.

Click Here To Watch NOW

‘గబ్బర్‌ సింగ్‌’ కాంబో ఈజ్ బ్యాక్‌ అంటూ… ఆ మధ్య ఎప్పుడో పవన్‌ కల్యాణ్‌ – హరీశ్ శంకర్‌ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అంటూ పేరు అనౌన్స్‌ చేశారు. దీంతో త్వరలోనే సినిమా స్టార్ట్‌ అనుకున్నారంతా. ఈలోగా పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ భుజానికెత్తుకున్నాడు. దీంతో ‘భవదీయుడు’ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ చిత్రీకరణే జరుగుతోంది.

అంతేకాదు ‘భవదీయుడు’ ఇంకా లేట్‌ అవ్వొచ్చని, ఉండకపోవచ్చని కూడా ఈ మధ్య వార్తలొచ్చాయి. పవన్‌ ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌కు పవన్‌ ఓకే చెప్పారని కూడా అన్నారు. అయితే మైత్రీ టీమ్‌ ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి ఓ ఫొటో రిలీజ్‌ చేసింది. దీంతో జూన్‌లోనో, జులైలోనే సినిమా ఉంటుంది అనుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే సినిమా ఈ రెండు నెలలు దాటి ఆగస్టులోకి వెళ్తుంది అంటున్నారు.

‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం హరీష్ శంకర్ డైలాగ్ వెర్షన్‌తో సహా… ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఈ పని తుది దశకు చేరుకుందని సమాచారం. దీంతో నటీనటుల ఎంపిక మొదలుపెట్టారట. ఈ సినిమాలో గ్లామ‌ర్‌కు ఏమాత్రం కొద‌వ లేకుండా హ‌రీష్ శంక‌ర్ జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని టాక్‌ వినిపిస్తోంది. ఓ క‌థానాయిక‌గా పూజా హెగ్డే ఫిక్స్‌ అయిపోయింది. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు ఎవరనేది తేలాల్సి ఉంది.

ఈ సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్‌ లెక్చ‌రర్‌గా న‌టించ‌బోతున్నాడు. పోస్టర్లు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్ని ఫ్రెష్‌గా ఉండేలా రాసుకున్నాడ‌ట హ‌రీష్‌. ఇక ఐటెమ్ సాంగ్‌ ఎలాగూ ఉంటుంది. దాని కోసం మరో కథానాయికను వెతకాల్సి ఉంది. దీనికి ఇంకా టైమ్‌ ఉంది. అయితే ఐటెమ్‌ భామతో కలిపి మొత్తంగా నలుగురు హీరోయిన్లు సినిమాలో ఉంటారట.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus