రష్మిక వాళ్ళిద్దరితో పోటీపడి గెలవగలదా..?

ఇప్పట్లో స్టార్ హీరోయిన్ అనగానే మనకి పూజా హెగ్దే మాత్రమే ఎక్కువ గుర్తొస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పుణ్యమా అని రష్మిక మందన కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ వెంటనే నితిన్ తో చేసిన ‘భీష్మ’ చిత్రం హిట్ అవ్వడం కూడా ఈమెకు పెద్ద ప్లస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె చేతిలో పెద్ద ఆఫర్లే ఉన్నాయి. తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘సుల్తాన్’ చిత్రంతో పాటు తెలుగులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ రెండు చిత్రాలు కూడా హిట్ అయితే ఈమె తమిళంలో కూడా బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక సమస్య కూడా ఉంది. పూజా హెగ్దే ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు ఎక్కువ చేస్తుంది. ఆమె చాలా వరకూ గ్లామర్ పైనే డిపెండ్ అయ్యింది కాబట్టి.. ఆమె ఎంత కాలం టాప్ ప్లేస్ లో ఉంటుందో చెప్పలేము. ఇక తమిళంలో సాయి పల్లవి, కీర్తి సురేష్ లకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా అంతే. సాయి పల్లవి తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో చితక్కొట్టేస్తుంది. హీరోని కూడా డామినేట్ చేసేంతలా నటిస్తుంది అన్నా అతిశయోక్తి లేదు.

ఇక కీర్తి సురేష్ నటనతో పాటు కథల పట్ల బాగా శ్రద్ధ వహిస్తూ ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తానేంటో ప్రూవ్ చేసుకుని నేషనల్ అవార్డు కూడా కొట్టింది. సో వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే ఛాన్స్ బలంగా ఉంది. అయితే రష్మిక కేవలం కమర్షియల్ సినిమాలే చేస్తాను అంటూ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అలా అయితే ఆమెకు కష్టమే.. భవిష్యత్తులో సాయి పల్లవి, కీర్తి సురేష్ లతో పోటీ పడాలి.. లేదా పోటీలో నిలబడాలి అంటే.. తన పాత్రకు అలాగే నటనకు స్కోప్ ఉన్న సినిమాలు చెయ్యాల్సిందే.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus