వైల్డ్ కార్డుగా ఇంట్లోకి వచ్చిన స్వాతి దీక్షిత్‌ని మగవాళ్లు మెప్పిస్తే ఓ సర్‌ప్రైజ్ ఇస్తా అంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ఒక్కొక్కరు పెద్ద ప్రేమికుల్లా కవితలు, పాటలతో రంగంలోకి దిగిపోయారు. మెహబూబ్ అయితే తన ఫిట్‌నెస్‌కి పని పెట్టాడు. ఇంకా ఏమైందంటే? ‘‘అందం ఎలా ఉంటుందో… స్వాతిని చూస్తే తెలుస్తుంది. ఆడుకునే బొమ్మ ప్రాణంతో ఉంటే ఇలానే ఉంటుందేమో’’ అంటూ అమ్మ రాజశేఖర్ వర్ణించి మెప్పించాలని చూశాడు. ‘నాలోనే పొంగెను నర్మద…’ అంటూ అఖిల్ పాడాడు. ఇక్కడ ‘నర్మద’ను తీసుకొచ్చాడు అఖిల్. బిగ్‌బాస్ ఇంట్లో నర్మద అంటే ఎవరో గుర్తుందిగా. బాడీనే నమ్ముకొని బిగ్‌బాస్‌లో ఉంటున్నాడేమో అంటూ కామెంట్లు వస్తున్న మెహబూబ్ అదే పని చేశాడు. ఏకంగా 100 పుషప్స్ తీసి స్వాతిని మెప్పించాలని చూశాడు.
నాకు ఇంప్రెస్ చేయడం రాదు అంటూనే అవినాష్ మంచి ఎక్స్‌ప్రెషన్‌తో మెప్పించాలని చూశాడు. ‘నువ్వు నవ్వితే బాగుంటావు. ఒక్కసారి నవ్వితేన ఇంత బాగున్నావంటే.. జీవితాంతం తోడుంటే ఇంకా నవ్వుతూనే ఉంటావు. నువ్వు బుట్టబొమ్మను కావు. బాపు బొమ్మవి. నీ పేరు స్వాతి దీక్షిత్. నీ కోసం ఎన్ని దీక్షలైనా చేయొచ్చు’’ అంటూ కాస్త గట్టిగానే పులిహోర కలిపాడు అవినాష్. ‘ఏక్ బార్..’ పాటకు సిగ్నేచర్ మూమెంట్స్ వేశాడు కుమార్ సాయి. ‘ఈ ఇంట్లో నీ విషయంలో కేరింగ్ చూపిస్తా… ఇంట్లో వాళ్లు గుర్తుకురాకుండా చూసుకుంటా’ అని ప్రామిస్ వేశాడు సోహైల్.
ఇక అభిజీత్ వచ్చి ‘నింగి, నేల నిలిచేదాకా తోడుగా..’ అంటూ పాడాడు. ముట్టుకుంటే కందిపోయే ముత్యాలు ముద్దుగుమ్మ అంటూ నోయల్ తనదైన శైలిలో పాడాడు. మొత్తం మగాళ్లలో అఖిల్, రాజశేఖర్, నోయల్, అవినాష్‌కు స్వాతి దీక్షిత్ రోజాపువ్వు ఇచ్చి ఓటేసింది. దీంతో వాళ్ల కోసం కోసం బిగ్‌బాస్ లాంజ్ ఓపెన్ చేశాడు. గెలిచినవాళ్లు మాత్రమే అందులో పార్టీ చేసుకున్నారు. మిగిలిన టీమ్.. ఇంట్లో కూర్చొని అద్దాల వెనుక నుంచి చూశారు. కొందరు డ్యాన్స్‌లు వేశారు. ఈ టాస్క్ ఎందుకు పెట్టాడో బిగ్‌బాస్‌కే తెలియాలి.