చిరంజీవి అండ్ బీజేపీ.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఇటువైపు బీజేపీ, అటువైపు చిరంజీవి ఎక్కడా ఓపెన్‌గా మాట్లాడటం లేదు కానీ.. చిరుని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీ అధిష్ఠానం చూస్తోంది. గత కొంతకాలంగా చిరంజీవి చుట్టూ బీజేపీ చక్కర్లు చూస్తే ఎవరికైనా ఈ డౌట్ తప్పకుండా వస్తుంది. రీసెంట్‌గా చిరంజీవికి బీజేపీ నుండి వస్తున్న అమితమైన ప్రేమ, గౌరవం, పురస్కారాలే దీనికి ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు. దీంతోపాటు కొన్ని ప్రశ్నలు కూడా అని చెప్పొచ్చు.
చిరంజీవి ఇటీవల ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022’ అనే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ పురస్కారాన్ని చిరంజీవి అర్హత గురించి ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్ 150కిపైగా సినిమాలతో టాలీవుడ్‌లో ప్రజెంట్ స్టార్స్‌లో చిరంజీవి టాప్‌లో ఉన్నారు. అయితే ఇచ్చే టైమ్ గురించి చర్చ అంతా. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ అవసరాలు చూసుకునే బీజేపీ ప్రభుత్వం చిరంజీవి ఈ పురస్కారం ఇచ్చింది అని అంటున్నారు.
మొన్నీమధ్య మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అక్కడ స్టేజీ మీద కూడా చిరంజీవిని బాగానే రిసీవ్ కూడా చేసుకున్నారు. అప్పుడు రాజకీయాల కోసం చిరంజీవిని దువ్వుతున్నారు అని అన్నారు. ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం అది అని కూడా ఉన్నారు.
తాజాగా ఇఫిలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్టేజీ మీదే చిరంజీవి ‘రాజకీయాల్లోకి మళ్లీ ఎప్పుడు వస్తారు’ అని అడిగారు. దానికి చిరంజీవి నాక్‌గా నవ్వుతూ సమాధానం చెప్పి తప్పించుకున్నారు అనుకోండి. అయితే ఇదంతా చూస్తే చిరంజీవిని బీజేపీలో ఇన్వైట్ చేసే ప్రాసెస్ బీజేపీ ఇంకా స్టాప్ చేయలేదు అని అర్థమవుతోంది. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చిరంజీవిని తరచుగా కలుస్తుంటారు కూడా. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీకి మిత్రుడు కావడం గమనార్హం.