ఒకప్పుడు సినిమా హైప్‌ను పోస్టర్లు, కటౌట్లు చూసి కొలిచేవారు. కానీ ఇప్పుడు ‘బుక్‌మైషో’ (BMS) ట్రెండింగే అసలైన కొలమానంగా మారుతోంది. సినిమాకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి టికెట్ల అమ్మకాలే అసలైన క్రేజ్ ని హైలెట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా, బుక్‌మైషో చరిత్రలో ఆల్ టైమ్ అత్యధిక టికెట్లు అమ్ముడైన భారతీయ చిత్రాల లిస్ట్ నీ చూస్తే పాన్ఇండియా మార్కెట్‌లో సౌత్ సత్తా ఏంటో అర్థమవుతుంది.
ఈ లిస్ట్‌లో నంబర్ 1 స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. అల్లు అర్జున్ సృష్టించిన ఈ సునామీ దరిదాపుల్లో కూడా మరో సినిమా లేదు. ఏకంగా 20.41 మిలియన్ (2 కోట్లకు పైగా) టికెట్లు అమ్మి, ‘పుష్ప 2’ ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డును కొట్టాలి అంటే అంత ఈజీ కాదు.
ఇక టాప్ లిస్ట్ మొత్తం సౌత్ సినిమాల హవానే కనిపిస్తోంది. రెండో స్థానంలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ (13.14 మిలియన్ టికెట్లు) నిలిచి, తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక ఐదో స్థానంలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ (11.17 మిలియన్ టికెట్లు) అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలనం సృష్టించింది.

బాలీవుడ్ చిత్రాలు గట్టి పోటీ ఇచ్చినా, సౌత్ జోరు ముందు వెనుకబడ్డాయి. విక్కీ కౌశల్ ‘ఛావా’ (12.58 మిలియన్) మూడో స్థానంలో, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (12.40 మిలియన్) నాలుగో స్థానంలో నిలిచాయి. హారర్ కామెడీ ‘స్త్రీ 2’ (11.16 మిలియన్) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ నంబర్లతో ఒక విషయంలో క్లారిటీ వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అసలైన ‘హైప్‘ ఇప్పుడు సౌత్ కంటెంట్ చేతిలోనే ఉంది. ముఖ్యంగా టాప్ 2 స్థానాల్లో ‘పుష్ప 2′, ‘కల్కి‘ ఉండటం తెలుగు సినిమా ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఇక బుక్‌మైషో రికార్డుల ప్రకారం, పాన్ ఇండియా బాక్సాఫీస్‌కు ‘పుష్పరాజ్‘ అసలైన బాస్‌గా నిలిచాడు. మరి రానున్న రోజుల్లో ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.
