పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న రిలీజ్ కాబోతుంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయ్యింది. 80 శాతం షూటింగ్ ను క్రిష్ కంప్లీట్ చేశారు. కానీ తర్వాత జ్యోతి కృష్ణ పలు మార్పులు చేసినట్టు.. ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళ పాటు సెట్స్ పై ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాత ఏ.ఎం.రత్నం ఎంతో కష్టపడి పూర్తిచేశారు.
ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందు… ‘హరిహర వీరమల్లు’ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించేవి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అవన్నీ పటాపంచలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే పోటీగా మరో సినిమా రిలీజ్ కాదు. ఒకవేళ రిలీజ్ అయినా దానికి ఎక్కువ థియేటర్స్ దక్కవు. ఆడియన్స్ ఫోకస్ కూడా ఆ సినిమాపై ఉంటుందన్న నమ్మకం ఉండదు. అందుకే విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ని సైతం పోస్ట్ పోన్ చేశారు. అలాంటిది విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సార్ మేడం’ టైటిల్ వీడియో రిలీజ్ అయ్యింది.
నిత్యా మీనన్.. విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తోంది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అతని ఖాతాలో మంచి విజయాలే ఉన్నాయి. సో ఇది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మరి కాంపిటీషన్లో ఎలా నిలబడుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.