బ్రహ్మానందం (Brahmanandam) , రాజా గౌతమ్ (Raja Goutham)..కాంబినేషన్లో ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) సినిమా వచ్చింది. నిఖిల్ ఆర్ వి ఎస్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka రూపొందించారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ‘బ్రహ్మ ఆనందం’ కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. వీక్ డేస్ లో ఈ సినిమా నిలబడలేకపోయింది.
చిరుతో (Chiranjeevi) పాటు (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) ..లు ఈ సినిమాను ప్రమోట్ చేసినా లాభం లేదు. మొదటి వారం సాదాసీదా వసూళ్లు వచ్చాయి. ఇక బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.31 cr (ప్రీమియర్స్ తో కలుపుకుని) |
సీడెడ్ | 0.13 cr |
ఆంధ్ర(టోటల్) | 0.27 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.13 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.84 cr |
‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా రూ.0.84 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.41 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.6.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది ఇక కష్టమే అని చెప్పాలి.