విశ్వక్ సేన్(Vishwak Sen) , ఆకాంక్ష హీరో, హీరోయిన్లుగా నటించిన ‘లైలా’ (Laila) సినిమా గత వారం అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించారు. సినిమాలో కామెడీ, ఫైట్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నీ శృతిమించాయి అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా రెండో రోజు నుండి బాగా డౌన్ అయ్యింది.
వీక్ డేస్ లో మినిమమ్ షేర్స్ కూడా వసూల్ చేయలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.34 cr |
సీడెడ్ | 0.13 cr |
ఆంధ్ర(టోటల్) | 0.41 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.88 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.26 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 1.14 cr |
‘లైలా’ చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘లైలా’ మొదటి వారం కేవలం రూ.1.14 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.02 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆ ఫీట్ అందుకోవడం అన్ని విధాలుగా కష్టమే అని చెప్పాలి.