బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’… హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ అవ్వగా …. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరించడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ చిత్రం. అంతేకాకుండా 13 వ రోజు కూడా పర్వాలేదనిపించింది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
5.89 cr
సీడెడ్
1.33 cr
ఉత్తరాంధ్ర
1.34 cr
ఈస్ట్
0.93 cr
వెస్ట్
0.60 cr
గుంటూరు
1.03 cr
కృష్ణా
0.55 cr
నెల్లూరు
0.41 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
12.08 cr
‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు మరియు హిందీ వెర్షన్లతో కలుపుకుని రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.12.08 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఇప్పటివరకు ఈ చిత్రం బయ్యర్స్ కు రూ.7.28 కోట్ల లాభాలను అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రేపు నేషనల్ సినిమా డే కావడంతో.. రేపు ఒక్క రోజు టికెట్ రేట్లు బాగా తగ్గించారు. కాబట్టి ‘బ్రహ్మాస్త్రం’ రేపు ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది.