‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఫ్యాన్స్ గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో జంతువులతో తారక్ సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత అదే జంతువుల్లోని పులితో రామ్‌చరణ్ చేసే ఫైట్. అదంతా విజువల్ ఎఫెక్ట్స్‌లో చేసిన సన్నివేశాలే అని అందరికీ తెలుసు. అయితే అంత అద్భుతమైన సన్నివేశాలు ఎలా రూపొందించారు అనేది ఆసక్తికరమే. ఈ విజువల్ ఎఫెక్ట్స్‌ను అల్ జహ్రా స్టూడియోస్ చేసిందట. ఆ విజువల్ ఎఫెక్ట్స్ బ్రేక్ డౌన్ వీడియోను అల్ జహ్రా టీమ్ తమ ట్విటర్ ఖాతలో షేర్ చేశారు.
పులి తయారీతోపాటు, రామ్‌చరణ్ ఆ పులితోపాటు చేసిన ఫైట్ ఎలా షూట్ చేసింది బ్రేక్ డౌన్ వీడియోలో చూపించారు. దాంతోపాటు రాహుల్ రామకృష్ణ పామును పట్టుకుని, చరణ్‌ను కాటేసేలా చేసే సన్నివేశం బ్రేక్ డౌన్ కూడా షేర్ చేసి ట్వీట్‌లో ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ వీడియోను మీరు కూడా చూసి వావ్ అనుకోవచ్చు. ‘ఆర్‌ఆర్ఆర్’ వీఎఫెక్స్ వర్క్ అంతా శ్రీనివాస్ మోహన్ అండ్ టీమ్ క్రెడిట్ అని చెప్పొచ్చు.
రాజమౌళి మదిలోని ఆలోచనలను అర్థం చేసుకొని వాటికి విజువల్ ఎఫెక్ట్స్‌లో రూపమించ్చారు శ్రీనివాస్ మోహన్ టీమ్. ఈ క్రమంలో అల్ జహ్రా టీమ్‌తో పాము, పులి సీన్స్ వర్క్ చేయించారట. ఆ టీమ్ చేసిన వర్క్ వీడియోను షేర్ చేస్తే.. శ్రీనివాస్ మోహన్ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ బ్రేక్ డౌన్ వీడియోను షేర్ చేస్తూ అల్ జహ్రా టీమ్ శ్రీనివాస్ మోహన్, రాజమౌళికి థ్యాంక్స్ చెప్పింది.
‘‘ఆర్‌ఆర్ఆర్’లో పులి సీన్, పాము సీన్ కోసం మేం చేసిన 18 వీఎఫ్‌ఎక్స్ షాట్లు ఇవే. రాజమౌళి, శ్రీనివాస్ మోహన్‌తో పని చేయడం మాకు ఎప్పుడూ ఆనందమే’’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది అల్ జహ్రా టీమ్. ఈ దిగువ వీడియోలో ఆ 18 షాట్లను మీరూ చూడొచ్చు. ఒళ్లు గగుర్పొడిచే ఆ సీన్స్‌ను ఎంత బాగా తీశారో చూసేయొచ్చు.