రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ వల్ల వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. మొదట నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్ మూడుసార్లు వాయిదా పడటం వల్ల ఏకంగా 150 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయిందని సమాచారం.
పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేయనున్నారు. ఇతర దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. వచ్చే నెల చివరినాటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి. భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతపై ఒత్తిడి ఉందని సమాచారం. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఈ సినిమాకు 300కోట్ల రూపాయలు వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైనా భారీ మొత్తంలో కలెక్షన్లు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కు రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. చరణ్, తారక్ ఈ సినిమాతో రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.