కొంతమంది దర్శకులు ఏంటో.. వరుస పెట్టి హీరోలను ఫైనల్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఏదో కారణం వల్ల సినిమా సెట్స్‌పైకి వెళ్లదు. అలా అని రెండో రకం దర్శకులు అంతకుముందు ఏమైనా ఫ్లాప్ ఇచ్చారా అంటే భారీ విజయమే ఇచ్చి ఉంటారు. తొలి రకం దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ‘ఉగ్రమ్’ సినిమాతో తానేంటో చూపించిన ఆయన ‘కేజీయఫ్’ సినిమాలు, ‘సలార్ : ది సీజ్ ఫైర్’ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు. అలాంటి ప్రశాంత్ (Prashanth Neel) కెరీర్ నెక్స్ట్ పదేళ్లు ఏంటా అని చూస్తే..
Prashanth Neel
ఆయన డైరీ ఖాళీ లేదు.. బుర్రా ఖాళీ లేదు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన లైనప్ అలా ఉంది మరి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐదారేళ్లకు ఆయన ఫ్రీ అవుతారు. అయితే ఓ పట్టాన ఆయన సినిమాలు అవ్వవు, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా తేలే పరిస్థితి లేదు. అందుకే వచ్చే పదేళ్లు ఆయన బిజీ అని అంటున్నారు. దానికి ఆయన సినిమాలు, వాటి స్పాన్ లెక్కలు చెబుతున్నారు. స్టార్ దర్శకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ఎంతమంది దగ్గర నాలుగు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
ఎంత వెతికినా ప్రశాంత్ నీల్ కాకుండా ఇంకో పేరు వినిపించదు. సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు అనుకోండి. అయితే ప్రశాంత్ లెక్కే పక్కాగా తేలింది. ఆయన సినిమా పూర్తి చేసుకుంటే తమ సినిమా స్టార్ట్ చేద్దామని స్టార్ హీరోలు వెయిటింగ్‌లో ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే.. తారక్‌తో ఓ సినిమా అనౌన్స్ అయింది. ఆ సినిమాను 2026లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎలాగూ ఈ సినిమా రెండు పార్టులు ఉంటుంది.
తొలి పార్టు అయ్యాక ప్రభాస్ ‘సలార్: శౌర్యాంగ పర్వం’ పూర్తి చేయాలి. ఇప్పటికే మొదలవ్వాల్సిన ఈ సినిమా లేట్ అయింది. ఈ సినిమాను 2028లో తీసుకొస్తారని టాక్. ఆ తర్వాత ‘కేజీయఫ్ 3’ చేస్తారని టాక్. ఇదొచ్చినప్పటికి 2029 ఎండింగ్ లేదంటే 2030 స్టార్టింగ్ అని చెబుతున్నారు. ఈ సినిమాలు అయ్యాక రామ్‌చరణ్ సినిమా చేస్తారట. ఆ సినిమా 2031 ఆఖరులో వచ్చే అవకాశం ఉంది. అయితే చరణ్ సినిమా ఎన్ని పార్టులు అనేది తేలాలి. మరోవైపు తారక్ సినిమా రెండో పార్టు ఉంటుంది. ఈ లెక్కన ఇవన్నీ రావడానికి, రాయనడానికి పదేళ్లు పక్కా.