నాని నటించిన ‘దసరా’ సినిమా మార్చ్ 30న విడుదలైంది. సినిమాకి మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా అద్భుతంగా నమోదయ్యాయి. నాని కెరీర్లోనే కాదు మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో కూడా ఈ మూవీ అత్యధికంగా రూ.20 కోట్లకు పైనే షేర్ ను సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి.. తప్పకుండా ఈ మూవీ రూ.100 కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తుంది అని అంతా అనుకున్నారు.
అయితే రెండో రోజు కలెక్షన్లు తేడా కొట్టాయి. నైజాంలో బాగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు తగ్గాయి. దీంతో బయ్యర్స్ లో ఆందోళన మొదలైంది. నాని (Nani) కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమా కూడా ఇదే. అందుకే బయ్యర్స్ టెన్షన్. శుక్రవారం వర్కింగ్ డే కాబట్టి ఏ సినిమాకి అయినా.. కలెక్షన్స్ విషయంలో రిలీజ్ రోజుతో పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైగా ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి.. సహజంగానే కలెక్షన్స్ తగ్గుతాయి.
అయితే ఈవెనింగ్ షోలు, నైట్ షోలు బాగానే ఉన్నాయి. ఈరోజు వీకెండ్, రేపు సండే కాబట్టి.. కలెక్షన్లు బాగానే వస్తాయి. అయితే వీకెండ్ ముగిసేలోపు… మిడ్ రేంజ్ హీరోల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ‘గీత గోవిందం’ సినిమా కలెక్షన్స్ ను.. ఈ మూవీ అధిగమిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొదటి రోజు కలెక్షన్స్ ను బట్టి.. ఆ ఫీట్ ను ఈజీగా సాధిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ రెండో రోజు కలెక్షన్స్ తగ్గడంతో అందరిలోనూ ఆ అనుమానం ఎక్కువైంది. చూడాలి చివరికి ఏం జరుగుతుందో..!