కొద్దిరోజుల క్రితం దగ్గుబాటి రానా తన ప్రేయసి మిహికా బజాజ్ ని పరిచయం చేశాడు. ఆ వెంటనే కుటుంబ సభ్యుల సమక్షంలో రోకా వేడుక కూడా చేసుకున్నారు. ఇక ఆగస్టు 8, వీరి వివాహ దినముగా ప్రకటించడం జరిగింది. కాగా రానా పెళ్లి ఏర్పాట్ల గురించి నిర్మాత సురేష్ బాబుని అడుగగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఒకప్పుడైతే పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి, ఎన్ని కార్డులు ప్రింట్ చేయించాలి, ఏమి పెట్టాలి ఇలా అనేక కార్యక్రమాలు ఉండేవి.
కరోనా వైరస్ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పరిమిత సభ్యుల మధ్య జరపాల్సిన పరిస్థితి ఉంది,అన్నారు . అందువలన రానా పెళ్లి విషయంలో పెద్ద సందడి లేదు అని సురేష్ బాబు పరోక్షంగా తెలియజేశారు. కాగా రానా-మిహికా ల పెళ్ళికి సంబంధించి చిన్న చిన్న పనులు జరుగుతున్నట్లు సమాచారం. పెళ్ళికి కేవలం నెలరోజులు సమయం మాత్రమే ఉండగా…హైదరాబాద్ లో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుంది. దీనితో అనేక ఆంక్షలు మరియు జాగ్రత్తల మధ్య వీరి వివాహం జరపనున్నారు.
ఇండస్ట్రీ పెద్దలు సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం లేకపోవచ్చు. రామానాయుడు గారి పెద్ద మనవడు వివాహం గ్రాండ్ గా చేద్దాం అనుకుంటే, కరోనా వాళ్ళ ఆశలకు అడ్డుకట్ట వేసింది. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కనున్న హిరణ్య కశ్యప మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. స్క్రిప్ట్ మరియు కథ డిమాండ్ రీత్యా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తారట.