అలా అయితే బెల్లంకొండ బాలీవుడ్ ఆశలు ఏమవుతాయి..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. టాలీవుడ్లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడు. ఇతని కెరీర్లో చేసింది మొత్తం 8 సినిమాలు. అందులో హిట్లు మాత్రం 3 మాత్రమే. అందులో కూడా ఒకటి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. అయితే ఇతను నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి భారీ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి. అక్కడి లోకల్ ఛానల్స్ లో కూడా ఆ సినిమాలకు మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యాయి.

అందుకే అతని సినిమాలకు డబ్బింగ్ రైట్స్ బాగా అమ్ముడవుతాయి. అయితే ఈ హీరో ఇంకొంచెం ఎక్కువగా ఫీలయ్యి.. బాలీవుడ్లో డెబ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. తనను హీరోగా పరిచయం చేసిన వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ అనే బ్లాక్ బస్టర్ చిత్రంతో..! ‘పెన్ స్టూడియోస్’ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ మొన్నామధ్య ప్రచారం జరిగింది. నార్త్ లో బయ్యర్స్ ఎవ్వరూ ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేయకపోవడంతో.. చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని సమ్మర్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి అని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus