Chiranjeevi: ఆయన పదజాలం వల్ల బాధపడ్డ చిరంజీవి.. కానీ?

మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్టులుగా గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. సినిమాసినిమాకు నటుడిగా ఎదుగుతూ మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా అద్భుతంగా నటిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి మృతిపై చిరంజీవి సంతాపం తెలియజేయడంతో పాటు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

నేను యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలపై గుడిపూడి శ్రీహరి ఆరోగ్యకరమైన విమర్శలు చేశారని ఆ విమర్శలు నటుడిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. నా నట జీవితంను సరైన మార్గంలో నడిపించిన వారిలో గుడిపూడి శ్రీహరి ఒకరని చిరంజీవి తెలిపారు. నా సినిమా సెట్ లో గుడిపూడి శ్రీహరి, మరి కొందరు పాత్రికేయులతో మాట్లాడి ఎన్నో విషయాలను నేర్చుకునేవాడినని చిరంజీవి చెప్పుకొచ్చారు. సితారలో ఆయన రివ్యూలు రాసేవారని ఆయన పదజాలం హర్ట్ చేసేలా ఉన్నా టీచర్ స్టూడెంట్ కు చెప్పినట్టుగా ఉండేదని చిరంజీవి కామెంట్లు చేశారు.

తాను డైలాగ్స్ వేగంగా చెబుతున్నానని శ్రీహరి విమర్శించారని ఆయన రివ్యూ వల్ల నేను మారానని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో చిరంజీవి నటిస్తుండగా ఈ ఏడాది గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కానుంది.

గాడ్ ఫాదర్ రిలీజైన మూడు నెలలకు వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కానుంది. చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి వరుస అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Share.