చిరు క్లారిటీ ఇచ్చాడు!!!
- January 11, 2017 / 06:07 AM ISTByFilmy Focus
మెగాస్టార్ 150వ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ముందు సినిమా పై అంచనాలు ఒక ఎత్తు, అటుపై సినిమాపై అంచనాలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. చిరు సినిమా ట్రైలర్, రిలీజ్ అయిన పాటలు సృష్టించిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు, అయితే అదే క్రమంలో ఆరోజు వేదిక వేదికగా చిరు తమ్ముడు నాగబాబు చేసిన కొమెంట్స్ తీవ్ర దుమారాన్నే రేపాయి… ఒక పక్క యండమూరి ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే, మరో పక్క రామ్ గోపాల్ వర్మ పై ఫైర్ అయ్యాడు నాగబాబు. అయితే వాటిపై చిరుని ఒక ప్రముఖ టీవీ ఛానెల్ తమ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్ లో అడగడం జరిగింది.
అయితే దానికి చిరు ఏమని స్పదించాడో మీరే చూడండి…నాగ బాబూ, యండమూరిని అలా విమర్శించడానికి అసలు కారణం యండమూరి తన వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్పినప్పుడు చెర్రీ గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, అదే క్రమంలో చిరు సతీమణిని ఏకవచనం తో పిలవడం, అదే క్రమంలో తన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడాడు అందుకే నాగబాబు యండమూరిపై అలా తన కోపాన్ని ప్రదర్శించాడు అని చెప్పాడు..అయితే ఇక వర్మ విషయంలోనూ, అది పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు అని, వర్మ వరుస ట్వీట్స్ చేస్తున్న మేము స్పందించడం లేదు అంటేనే అర్ధం చేసుకోవాలి అని తెలిపాడు చిరు….ఇలా మొత్తం తన తమ్ముడు నాగబాబు చేసిన పనిని సమర్ధించుకుంటూనే అసలు విషయం తెలిపాడు చిరు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















