మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎంత కఠినమైన స్టెప్ అయినా చిరంజీవి అలవోకగా చేయగలరు. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన దాయిదాయిదామ్మ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో చిరంజీవి వేసిన వీణ స్టెప్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాంగ్ కు రాఘవ లారెన్స్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఒక సందర్భంలో లారెన్స్ మాట్లాడుతూ చిరంజీవి టాలెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దాయి దాయిదామ్మా సాంగ్ కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లామని అక్కడ మేమంతా పార్క్ లో కూర్చుని ఉన్నామని లారెన్స్ వెల్లడించారు. ఆ సమయంలో చిరంజీవి గారు రిహార్సల్స్ చేశావా అని అడగగా చేశానని చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసి చూపించాలని కోరగా పది మూమెంట్స్ చేసి చూపించానని లారెన్స్ అన్నారు. నేను వీణ స్టెప్ వేసిన వెంటనే చిరంజీవి గారు మరోసారి చెయ్యాలని కోరారని లారెన్స్ కామెంట్లు చేయడం గమనార్హం.
చిరంజీవి గారు వీణ స్టెప్ చేసే సమయంలో రెండుసార్లు చెయ్యి పట్టుకున్నానని మూడోసారి మాత్రం ఆయనే స్వయంగా చేశారని లారెన్స్ తెలిపారు. ఆ సమయంలో చిరంజీవి నాకంటే అద్భుతంగా డ్యాన్స్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. లారెన్స్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ విషయంలో మెగాస్టార్ కు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ కు తాజాగా విరామం ఇచ్చారు. 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం. విశ్వంభర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 60 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.