ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది. ఆచార్య సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిజ జీవితంలో ప్రతి ఒక్కరినీ ఆచార్యగా భావిస్తానని చిరంజీవి తెలిపారు. లైఫ్ లో తారసపడే ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటానని చిరంజీవి వెల్లడించారు.
చరణ్ ప్రవర్తనను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నానని అనిపిస్తుందని చరణ్ డైరెక్టర్ అనుకున్నది అనుకున్న విధంగా వచ్చేవరకు కెమెరా ముందు ఉంటాడని తాను పాటించే ప్రతి పద్ధతిని చరణ్ కూడా పాటిస్తాడని చిరంజీవి తెలిపారు. చరణ్ సెట్ లో అందరితో కలివిడిగా ఉంటాడని చిరంజీవి కామెంట్లు చేశారు. చరణ్ రకరకాల వంటలు చేయించి అందరికీ అందేలా చూస్తాడని చిరంజీవి అన్నారు. నేను 150 సినిమాల వరకు నేర్చుకుంటూ వచ్చానని చరణ్ తన సినిమాలను చూసి ప్రయాణాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నాడని ఆయన వెల్లడించారు.
కొత్త డైరెక్టర్లతో పని చేయడం గురించి చిరంజీవి స్పందిస్తూ పాతా పాతా కలిసి పని చేస్తే మోత అవుతుందని వెల్లడించారు. కొత్త ఆలోచనలను స్వాగతం పలకాలని కొత్తవారిని ప్రోత్సహిస్తున్నామని చిరంజీవి చెప్పుకొచ్చారు. చరణ్ నటించకపోతే సిద్ధ పాత్రకు పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం అని కథలో ఉన్న ఫీల్ ను పవన్ నూటికి నూరు శాతం తీసుకువస్తాడని తన అభిప్రాయమని చిరంజీవి వెల్లడించారు. అంతవరకూ ఛాన్స్ తీసుకోలేదని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.
కరోనా సమయంలో ప్రతి రంగం కుదేలైందని టికెట్ ధరలు పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. ప్రజలపై భారం పడకుండా ధరలు పెంచారని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.