మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తొలి సినిమా చిరుతకు దర్శకత్వం వహించే అవకాశం పూరి జగన్నాథ్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ చిరంజీవి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిరుత సినిమాతో రామ్ చరణ్ కు హిట్ ఇచ్చారు. ఆ తరువాత పలువురు మెగా హీరోలతో సినిమాలను తెరకెక్కించిన పూరీ జగన్నాథ్ చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు సినిమాను తెరకెక్కించలేదు. కొన్నేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ ఆటో జానీ కథను చిరంజీవికి చెప్పగా ఆ కథ చిరంజీవికి నచ్చలేదు.
రీఎంట్రీలో వరుసగా ఇతర భాషల డైరెక్టర్లకు, ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్న చిరంజీవి పూరీ జగన్నాథ్ కు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తే చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కు చిరు నుంచి పిలుపు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకోని డైరెక్టర్లకే అవకాశాలను ఇస్తున్న చిరంజీవి పూరి జగన్నాథ్ విషయంలో నిర్ణయం మార్చుకోవాలని పలువురు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
రాబోయే రోజుల్లో ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ గురించి ఈ నెల 22వ తేదీన ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.