మెగాస్టార్ చిరంజీవి సినిమాలకి ఓవర్సీస్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన రీ ఎంట్రీలో చేసిన సినిమాలను గమనిస్తే ‘ఖైదీ నెంబర్ 150 ‘ 2 మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ తోనే ఆ మూవీ వన్ మిలియన్ పైగా కలెక్ట్ చేసింది. ఇక ‘సైరా’ కూడా 2 మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. ‘ఆచార్య’ డిజాస్టర్ అయినా దగ్గర దగ్గర్లో వన్ మిలియన్ వరకు కలెక్ట్ చేసింది. ‘గాడ్ ఫాదర్’ కూడా వన్ మిలియన్ వరకు కలెక్ట్ చేసింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా ఓవర్సీస్ లో 2 మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. అయితే చిరు (Chiranjeevi) లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఓపెనింగ్స్ అక్కడ చాలా దారుణంగా ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 11న ‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఆగస్టు 10 నుండే అక్కడ ప్రీమియర్ షోలు పడతాయి. అయితే అక్కడ ‘భోళా శంకర్’ సినిమాకి గ్రాండ్ రిలీజ్ దక్కడం లేదు. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ కాబోతుంది. మరోపక్క ‘జైలర్’ సినిమా కూడా లిమిటెడ్ రిలీజ్ నే దక్కించుకుంది.
అయినప్పటికీ ‘జైలర్’ అడ్వాన్స్ బుకింగ్స్ $300 K డాలర్స్ గా ఉండగా.. ‘భోళా శంకర్’ ఇంకా $100 K డాలర్స్ కూడా వసూల్ చేయకపోవడం గమనార్హం. సో ప్రీమియర్స్ కి $100 K డాలర్ మార్క్ ను టచ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అక్కడ రజినీకాంత్ ‘జైలర్’ డామినేషన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. బజ్ లేకపోవడం వల్లనే ‘భోళా శంకర్’ బుకింగ్స్ ఇంత డల్ గా ఉన్నాయని స్పష్టమవుతుంది.