ఓటీటీ ఆఫర్ కు మెగాస్టార్ నో.. కారణమిదే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు తన సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ ఓటీటీ కోసం సినిమా చేయమని ఇచ్చిన ఆఫర్ ను చిరంజీవి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఓటీటీ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్ర కోసం ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ ను కూడా చిరంజీవి వదులుకున్నారని సమాచారం.

నిర్మాతలు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా తన ప్రాధాన్యత బిగ్ స్క్రీన్స్ కు మాత్రమే అని చెప్పడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బడా ఓటీటీ సంస్థ మాస్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఉన్న గంట నిడివి గల సినిమా కోసం 25 రోజుల డేట్స్ కేటాయించాలని చిరంజీవిని కోరింది. అయితే కథ నచ్చినా చర్చల సమయంలోనే చిరంజీవి ఆ ఆఫర్ కు నో చెప్పారు. ఆ తర్వాత అదే సంస్థ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కోసం సంప్రదించగా చిరంజీవి ఆ ఆఫర్ ను కూడా కూడా వదులుకున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు తన ప్రాధాన్యత థియేటర్లకు మాత్రమేనని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నా స్టార్ హీరోలు సున్నితంగా ఆ ఆఫర్లను తిరస్కరిస్తూ ఉండటం గమనార్హం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.