మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలుండవు. ఎప్పటి నుంచో మెగా అభిమానులు అన్నదమ్ములు కలిసి సినిమా తీస్తే చూడాలని ఉందంటూ కోరుకుంటున్నారు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ కాసేపు తళుక్కుమన్నారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. టాలీవుడ్‌లో మెగా బ్రదర్స్ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. వీరిద్దరి మధ్య బంధం విడదీయరానిది. మధ్యలో కొన్ని వివాదాలు తలెత్తినా సమస్య వచ్చిందంటే ఇద్దరూ ఒకటైపోతారు. అలాంటి అన్నదమ్ముల మధ్య ఓ రోజు పవన్ చేసిన తప్పుకు చిరు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందట..
ఎందుకలా జరిగిందో తెలుసుకుందాం.. మెగా బ్రదర్స్ లో పవన్, నాగబాబులను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. వారిద్దరూ వాటిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. చిరంజీవి స్టార్ హీరోగా ఇదిగాక చెన్నైలో ఓ ఇల్లు కనుక్కొని తన కుటుంబంతో అక్కడే ఉన్నారు. అలా చెన్నై పరిసర ప్రాంతాల్లో కోడి రామకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుందట. ఈ సమయంలో చిరంజీవిని కొందరు లోకల్ గూండాలు ఆట పట్టించడం జరిగింది. మెగా బ్రదర్స్ లో పవన్, నాగబాబులను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు.
వారిద్దరూ వాటిని పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. చిరంజీవి స్టార్ హీరోగా ఇదిగాక చెన్నైలో ఓ ఇల్లు కనుక్కొని తన కుటుంబంతో అక్కడే ఉన్నారు. అలా చెన్నై పరిసర ప్రాంతాల్లో కోడి రామకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుందట. ఈ సమయంలో చిరంజీవిని కొందరు లోకల్ గూండాలు ఆట పట్టించడం జరిగింది. చిరంజీవి ఆ కామెంట్లను పట్టించుకోలేదట. ఎంత అసహ్యంగా మాట్లాడిన సైలెంట్ గా వెళ్లిపోయే వారట. అయితే ఓ రోజు చిరంజీవి కారు డ్రైవర్ ఈ విషయాన్ని తీసుకెళ్లి పవన్ కల్యాణ్ దగ్గర చెప్పాడట.
దాంతో పవన్ చిరంజీవికి తెలియకుండా ఆ గుండాల దగ్గరికి వెళ్లి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చాడట. దీంతో వారు గొడవకు దిగి నువ్వేం పెద్ద తోపా అంటూ అతడిని ఎగతాళి చేశారట.. ఈ క్రమంలోనే గొడవపెద్దదై కుప్పు స్వామి అనే వ్యక్తికి గాయాలయ్యాయట. విషయం తెలుసుకున్న చిరంజీవి.. ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యక్తికి తమ్ముడు చేసిన పనికి క్షమాపణ చెప్పి వచ్చారట. ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ ని తిట్టాడట. దాంతో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మాటలంటే ఊరుకోనన్నారట.