మొన్నీమధ్య జరిగిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి (Chiranjeevi) గురించి గొప్పగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఇప్పుడు తన తమ్ముడు, తనయుడి గురించి చిరంజీవి మాట్లాడారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆప్టా బిజినెస్ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఆ వేదిక మీదే తన అచీవ్‌మెంట్ గురించి మాట్లాడారాయన. కష్టపడుతూ వెళ్తే చాలు.. జీవితంలో అనుకున్నవి సాధించొచ్చు అని నమ్మే మనిషిని నేను. ఒకే ఒక జీవితం..
Chiranjeevi
అనుకున్నది సాధించాలి అని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాను. నేను జీవితంలో అచీవ్ చేసింది ఏంటి అని చూస్తే.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ (Ram Charan) . నా కుటుంబం కనిపిస్తాయి. ఇవే నా అఛీవ్‌మెంట్ అని గొప్పగా చెబుతూ ఆనందపడ్డారు చిరంజీవి. గతంలో ఓ సారి ఓ పత్రికలో మెగా కుటుంబం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్’ అని రాశారు. ఆ సమయంలో మేం చాలా ఆనందపడ్డాం.
మా గురించి అంత పెద్ద ఫ్యామిలీతో పోలచ్చి ప్రస్తావించడం చాలా ఆనందంగా అనిపించింది. చిరంజీవి చెప్పినట్లు.. బాలీవుడ్‌లో రాజ్ కపూర్ ఫ్యామిలీ లెగసిని సృష్టించి ఎంతో మంది స్టార్లను ఇచ్చింది. ఇక్కడ మెగా ఫ్యామిలీ కూడా అంతే. సినిమాల్లోకి చిరంజీవి వచ్చిన ఓ దారి వేశాక తొలి నాళ్లలోనే నాగబాబు (Nagendra Babu) వచ్చారు. నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చారు. అలాగే సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), వరుణ్ తేజ్ (Varun Tej) , వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej) , నిహారిక (Niharika), సుస్మిత కొణిదెల (Sushmita Konidela), అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు శిరీష్ (Allu Sirish), అల్లు బాబీ (Allu Bobby)..
ఇలా ఆయన నుండి చాలామంది సినిమాల్లోకి వివిధ రకాలుగా వచ్చి రాణించారు. వీళ్లే కాదు చిరంజీవి బావలు, చెల్లెళ్లు, ఇతర బంధువులు చాలామంది సినిమాల్లోకి వచ్చి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏదో కుటుంబం పేరుతో వచ్చారని టాలెంట్ లేకుండా ఇక్కడ ఉండిపోవడం లేదు. టాలెంట్ ఉంటేనే నిలుస్తున్నారు.