మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నారు.కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. అతనికి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.’మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాంచరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్.. ‘లాహే లాహే’ కు అనూహ్య స్పందన లభించింది.ఇక ఈ చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మే 13నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. కొరటాల మాట్లాడుతూ.. “మీ అందరిలాగే నేను కూడా చిన్నప్పటి నుండీ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను.నా సినిమాల్లో కనిపించే మాస్ ఎలిమెంట్స్ కు ఓ విధంగా ఆయన కూడా ఓ స్ఫూర్తి. అలాంటిది నేను మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను అని తెలిసిన రోజున నా ఆనందం వర్ణనాతీతం.ఇక మొదటి రోజు షూటింగ్లో క్యారవాన్ దిగడమే బయటికి వెళ్ళి నా ఉత్సాహం అంతా చూపించాను.
మెగాస్టార్ కు నేను ‘యాక్షన్’ అని చెప్పడమే గొప్ప విజయంగా భావించాను. అయితే మెగాస్టార్ ఈ విషయం పై చాలా సరదాగా స్పందించారు. ‘నా సినిమాలు చూస్తూ పెరిగిన కొరటాల శివ.. డైరెక్టర్ అయ్యాక కూడా నేను హీరోగా సినిమాలు చేస్తుండడాన్ని నా విజయంగా భావిస్తున్నాను” అంటూ ఆయన నాకు షాక్ ఇచ్చారు. ఆయన అలా అనడం నాకు నిజంగా చాలా గొప్ప విషయం” అంటూ చెప్పుకొచ్చాడు.