మెగాస్టార్ చిరంజీవి ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. అందులో ‘గాడ్ ఫాదర్’ కూడా ఒకటి. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కి రీమేక్. ఆ తర్వాత చెప్పుకోవాలి అంటే.. ఎడిటర్ మోహన్ రాజా గారి అబ్బాయి మోహన్ రాజా.. 20 ఏళ్ళ తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార చిరుకి చెల్లెలుగా నటించింది.
సత్యదేవ్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అన్నిటికీ మించి ఈ ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ .. చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యింది అనే విషయాన్ని పట్టించుకోకుండా ‘గాడ్ ఫాదర్’ ను జనాలు బాగానే చూశారు. దర్శకుడు మోహన్ రాజా .. ఒరిజినల్ చూసిన వారికి కూడా నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అయితే బాక్సాఫీస్ ఫలితం అంతంత మాత్రమే అనే కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తున్నప్పటికీ..
చిరుకి (Chiranjeevi) ఈ సినిమా బాగా నచ్చింది. దీనికి ప్రీక్వెల్ చేస్తే బాగుంటుంది అనే ఆశ ఆయనకు ఉంది. ‘గాడ్ ఫాదర్’ లో హీరో తండ్రి చనిపోయే ముందు అసలు హీరో ఎక్కడ ఉండేవాడు? ఏం చేసేవాడు? అతనికి ఓ ఫ్యామిలీ ఉండి చనిపోయిందా? అంటూ చిరునే కథ కూడా చెప్పేసి స్క్రిప్ట్ రెడీ చేసుకుని రావాలంటూ ఓపెన్ గా ఆఫర్ ఇచ్చేస్తున్నారు. మలయాళంలో ‘లూసిఫర్ 2 ‘ రూపొందుతుంది. అది కనుక చిరుకి నచ్చితే.. దీన్ని రీమేక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.