మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. దీనికి మొదట ‘సాహో’ దర్శకుడు సుజీత్ ను అనుకున్నప్పటికీ.. అతను స్క్రిప్ట్ తో చిరుని సంతృప్తిపరచకపోవడం వల్ల.. వినాయక్ ను రీప్లేస్ చేశారు మెగాస్టార్. ఇది బహిరంగ రహస్యమే. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. అయితే చిరు ఇంకా ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఎన్వీ ప్రసాద్ మరియు రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
చిరుకి కూడా వినాయక్ పై చాలా నమ్మకం ఉంది. తన రీ-ఎంట్రీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యతను చిరు.. వినాయక్ కే అప్పగించారంటే ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఓ విషయంలో మాత్రం వినాయక్ ను చిరు నిరాశపరిచారట. వివరాల్లోకి వెళితే.. ఈరోజు వినాయక్ పుట్టినరోజు. కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తారేమో అని వినాయక్ ఆశపడ్డారట. ఆయనే కాదు .. వినాయక్ అభిమానులు కూడా అదే కోరుకున్నారట. అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. వినాయక్ ‘ఇంటిలిజెంట్’ చిత్రం తరువాత మరో చిత్రం చెయ్యలేదు.
అది విడుదలయ్యి కూడా 2ఏళ్ళు దాటేసింది. మధ్యలో వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమా చెయ్యాలి అనుకున్నారు. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. కనీసం డైరెక్టర్ గా తన కొత్త చిత్రం అనౌన్స్మెంట్ అయినా ఇస్తారు అనుకుంటే.. అదీ జరగలేదు. ఎలాగూ ‘ఆచార్య’ పూర్తయ్యాక మెహర్ రమేష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారు కాబట్టి.. ఆయన ఎటువంటి అప్డేట్ ఇచ్చి ఉండకపోవచ్చు.