సినిమాల్లో మకుటం లేని మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి. విశేషమైన ప్రజాభిమానం, అశేషమైన స్టార్ ఇమేజ్ కలిగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఒండిపోయినప్పుడు కూడా చిరంజీవిని ఎవరూ గేలి చేయలేదు. అలాంటిది ఆయన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మాత్రం అందరూ ఆయన్ని ఎగతాళి చేశారు. అప్పట్నుంచి చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు తప్పితే రాజకీయాల్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. గత ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం కూడా చేయలేదు. దాంతో చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకొన్నాడేమో అని ఫిక్స్ అయిపోయారు జనాలు.
అయితే.. వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ చిరంజీవి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ముఖ్యమైన లీడర్లు చిరంజీవిని పర్సనల్ గా కలవడం, చిరంజీవితో చాలాసేపు బేటాయించడం జరిగిన తర్వాత ఈ ఆగస్ట్ 22న చిరంజీవి-కొరటాల కాంబినేషన్ సినిమా మొదలవ్వడంతోపాటు.. అదే రోజున చిరంజీవి బీజేపీలోకి చేరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఆరోజు సభాముఖంగా.. ప్రముఖ బీజేపీ లీడర్లు ఆయన్ను పార్టీలోకి స్వాగతించనున్నారని వినికిడి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఆగస్ట్ 22 వరకూ ఆగాల్సిందే.