మాస్ మహారాజ్ రవితేజ… ఒకప్పుడు సాదాసీదా రవితేజనే..!లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. 1990వ సంవత్సరం నుండీ సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేస్తూ వచ్చాడు. అయితే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ‘సింధూరం’ సినిమా అనే చెప్పాలి. కృష్ణవంశీ ఆ చిత్రానికి దర్శకుడు. చంటి అనే పాత్రని ఆ మూవీలో పోషించాడు రవితేజ. అంతకు ముందు నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ.
అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు కూడా పనిచేసారు. రవితేజ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లు రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ లు గా పనిచేసేవారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి మంచి స్నేహం ఉంది. రవితేజ- పూరి లు బాగానే ఉన్నారు కానీ.. కృష్ణవంశీతో రవితేజకి చెడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే… ఇటీవల ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రం 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కృష్ణవంశీ.
ఈ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. యాంకర్ కూడా పనిలో పనిగా ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన రవితేజ గురించి కృష్ణవంశీని ఓ ప్రశ్న అడిగాడు. ఆ వెంటనే అతనికి ‘సింధూరం’ లో కూడా అవకాశం ఇచ్చారు కదా అని..! కానీ దర్శకుడు కృష్ణవంశీ మాత్రం రవితేజ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అంటూ దాటేశాడు. దాంతో ఆ ఇంటర్వ్యూలో మొత్తంలో ఇదే హైలెట్ అయ్యింది. రవితేజ- కృష్ణవంశీలకి ఏ విషయంలో మనస్పర్థలు వచ్చాయి అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు మొదలయ్యాయి.