టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో అలీ (Ali) ఒకరనే సంగతి తెలిసిందే. అలీ ఇప్పటికీ కెరీర్ పరంగా బిజీగా ఉంటూ పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీలో ఉన్న అలీ రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని గతంలో ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారని అలీ పోటీకి సైతం దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అలీకి వైసీపీ పదవి ఇచ్చినా ఆ పదవి పెద్దగా ప్రాధాన్యత లేని పదవి కావడం, ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడం, వైసీపీలో ఉన్న సినిమా నటులకు ఆఫర్లు తగ్గుతుండటం, ఇతర కారణాల వల్ల అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. అలీ రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , అలీ మధ్య గ్యాప్ కూడా పెరిగిందనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ కూడా తగ్గాలని అలీ అభిమానులు కోరుకుంటున్నారు. అలీ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ అందరివాడు అనిపించుకున్నారు. అయితే పొలిటికల్ ఎంట్రీ తర్వాత అలీ కెరీర్ కు కొంతమేర నష్టం కలిగింది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అలీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలీ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం వల్ల ఇకపై మరిన్ని సినిమాలలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో కమెడియన్లకు ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదు. అలీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.